దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన తెరాస సర్కార్
కాంగ్రెస్ ఎస్ సి సెల్ జిల్లా కార్యదర్శి.
తొర్రూర్, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పార్టీ ఎస్సీ సెల్ కార్యకర్తలసమావేశం జరిగింది ఈ సమావేశం లో జిల్లా కార్యదర్శి సుంచు సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఎన్నికల్లో దళితుల అభివృద్ధి కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి దళిత ఓట్లతో రెండవ సారి కూడా అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను మరిచి పూర్తిగా దళితుల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు . దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నా హామీని తుంగలో తొక్కారని పేర్కొంటూ. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ విషయంలో దళితుల మధ్య గొడవలు సృష్టించి ఇండ్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని. మరియు ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కోసం మండలంలో సుమారు వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 పదిహేనుయూనిట్ లకే పరిమితం చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు , దీని ద్వారా దళితులను చిన్నచూపు చూడడమే అవుతుందని. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీ లోఎస్సీ సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ లో దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం జరిగేది, ఈ ప్రభుత్వ హాయంలో ఇట్టి ప్రక్రియను కొనసాగించక పోవడంతో దళితులు అయోమయానికి గురి అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల సంక్షేమం కొరకు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు విడుదల చేసివారి అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేసిందని కొనియాడుతూ.. ఈ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసిందంటూ, రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు కెసిఆర్ పాలనలో ఏ ఒక్క దళితులకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఎస్ సి ల ను అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment