Followers

హరిహర దేవస్థానంలో దొంగతనం

 హరిహర దేవస్థానంలో దొంగతనం






మందమర్రి,  పెన్ పవర్

మందమర్రి పట్టణంలోని హరిహర దేవస్థానంలో దొంగతనం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆలయ పురోహితుడు ఆలయాన్ని మూసివేసి వెళ్ళి, తిరిగి ఉదయం 6 గంటలకు వచ్చి చూసేసరికి ఆలయంలోని గణపతి, రమాసహిత సత్యనారాయణ స్వామి, శివాలయం ఆలయాల తాళాలు పగులగొట్టి ఉండగా, తలుపులు తెరిచి చూడగా విగ్రహాలకు అలంకరించిన వెండి ఆభరణాలు, ఇత్తడి దీపాలు, ఇత్తడి హారతి పాత్ర, రాగి బిందె తదితర 80 వేల రూపాయలు విలువగల ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు గుర్తించడం జరిగిందని వారు తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా పట్టణ ఎస్ఐ స్పందించి క్లూస్ టీం తో ఆలయాన్ని పరీక్షించడం జరిగిందని, అనంతరం మందమర్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...