Followers

అరవాలమ్మ తల్లి జాతరలో అశ్లీల నృత్యాలు

అరవాలమ్మ తల్లి జాతరలో అశ్లీల నృత్యాలు

సీతానగరం,పెన్ పవర్

చీపురుపల్లి గ్రామపంచాయతీ అచ్చియ్యపాలెం గ్రామ సమీపంలో కొలువై ఉన్న అరవాలమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని ఆర్కెస్ట్రా పేరుతో స్టేజ్ డెకరేషన్ ఆర్భాటాలతో పట్టపగలే మహిళలు భోజనాలు చేస్తుండగానే గడచిన సోమవారం జరిగిన అశ్లీల నృత్యాలు మండల చివర్లో జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విషయాన్ని తెలుసుకున్న కమిటీ నెంబర్లు అయిన నంబూరి.త్రీమూర్తులు రాజు, గిల్లా.శ్రీను,గోపిశెట్టి.తులసీరామ్ అను వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఉదయాన్నే లేచి చద్ది అన్నం మూట కట్టుకొని పనికి వెళ్లి వచ్చి పొద్దుగూకక ముందే నిద్రపోవడం అందరికీ తెలిసిన తీరు.  ప్రస్తుత సర్కారు గ్రామ కమిటీ నాయకులు పట్నం మాదిరిగా వీరికి రకరకాల ఆనందాలను చూపించాలనుకున్నారో ఏమో! అన్యం పుణ్యం తెలియని పల్లె ప్రజలకు పట్నం సోకులను చూపించడానికి చాలా కష్టపడ్డారు ఇక్కడ. ఇటువంటి నృత్యాలతో యువతను తప్పుదోవ పట్టించే విధంగా డాన్సులు నిర్వహించడంపై చాలా విడ్డూరంగా ఉంది అంటున్నారు ఇక్కడ మహిళలు. అందమైన పల్లెటూరి వాతావరణాన్ని నాశనం చేసే విధంగా కమిటీ చేసిన పని తీరుపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పంచాయతీ నాయకులు పల్లెలను పట్నాల తీరుగా అభివృద్ధి చేయాలనే మాట ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియదుగాని తమను ఎన్నుకున్న యువతను సంతోషపడేటట్లుగా చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేశారేమో... వీరిని పబ్లిక్ అడిగారో వీళ్లే ఆనందంతో  ఇటువంటి డాన్సులు పెట్టించారో ఏమో తెలియని పరిస్థితి నెలకొంది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...