Followers

హైద్రాబాద్ లో జుగ్ను సేవలు

 హైద్రాబాద్ లో జుగ్ను సేవలు

కూకట్ పల్లి,పెన్ పవర్


2014 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా తన సేవలను అందిస్తున్న జుగ్ను సంస్థ హైదరాబాద్ లో తన సేవలను ప్రారంభించింది. కూకట్ పల్లిలోని తబలా రెస్టారెంట్ లో బ్రోచర్ ఆవిష్కరణ, యాప్ ఆవిష్కరణలను నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ లు హాజరై బ్రోచర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో నలభై ఐదుకు పైగా నగరాలలో జుగ్ను సంస్థ ద్వారా బైక్, కార్, ఆటోలను నడుపుతున్నామని, హైదరాబాదులో కూడా సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్మార్ట్ క్లూస్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జుగ్ను యాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యాబ్ సర్వీస్ ధరలకంటే తక్కువ ధరకే జుగ్ను సంస్థ వాహనాలను నడపనునట్లు తెలిపారు. తమ సేవలను పొందడానికి వినియోగదారులు ప్లేస్టోర్, ఐస్టోర్ ల ద్వారా జుగ్ను యాప్ డౌన్లోడ్ చేసుకుని రైడ్ బుక్ చేసుకునే సమయంలో జుగ్ను50 అనే కోడ్ వాడటం ద్వారా యాభై శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే తమ సంస్థలో బైకులు, కార్లు, ఆటోలు అటాచ్ చేసుకొని డబ్బు సంపాదించాలి అనుకునేవారు జుగ్ను డ్రైవర్ యాప్ ద్వారా కేవలం ఐదు పత్రాలను సమర్పించి తమ సంస్థలో డ్రైవర్లుగా కొనసాగవచ్చని, మార్కెట్లో ఉన్న వివిధ సంస్థలు అందిస్తున్న దానికంటే రెట్టింపు లాభాలు తమ సంస్థ ద్వారా డ్రైవర్లు పొందగలరని తెలిపారు. ఈకార్యక్రమంలో హైదరాబాద్ మేనేజింగ్ పార్ట్ నర్స్ అశోక్, విష్ణు హైదరాబాద్ ఆపరేషన్ మేనేజర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...