Followers

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి;జిల్లా కలెక్టర్

 పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి;జిల్లా కలెక్టర్

వనపర్తి, పెన్ పవర్

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో  ఎదగాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. సోమవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహిళా దినోత్సవ  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లాఎస్పీ అపూర్వ రావు  తో పాటు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వారు చేసే పనిని చాలెంజిగా స్వీకరించి చేయాలన్నారు. మారుతున్న సాంకేతిక పద్ధతులను బట్టి మహిళలు కూడా ఎదగాలని సూచించారు. కోవిడ్  సమయంలో మహిళా ఉద్యోగుల విశేష సేవలందించారని ప్రశంసించారు. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాలలో ఎదగడానికి వీలుంటుంది అన్నారు.ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఒక మహిళ చదువుకుంటే సమాజం ఇల్లు బాగుంటుందని అన్నారు. అనంతరం ప్రభుత్వ శాఖలో విశేష సేవలు అందించిన మహిళా ఉద్యోగినులకు అవార్డులు అందజేశారు. డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ పుష్పలత, డి ఆర్ డి ఎ కోదండం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డబ్ల్యూ కృష్ణ చైతన్య, సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...