మహిళలే మహా రాణులు
పెద్దాపురం, పెన్ పవర్మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికి చాటుకోవడమే కాకుండా పలు రంగాలను శాసించే స్థాయికి చేరుకున్నారని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నవసేన గోరింట సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గోరింట గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బ్లురే హాస్పిటల్స్ (కాకినాడ) కు చెందిన వైద్య బృందం రక్త, వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఒకవైపు తమ కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతూనే మరొక వైపు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూ తమ శక్తిని నిరూపించుకుంటున్నారని అన్నారు.
మనమందరం భారతమాత ముద్దుబిడ్డలమని, ప్రపంచంలో ఏ ఒక్క దేశాన్ని కూడా స్త్రీతో పోల్చి చెప్పరని, మనదేశంలో మాత్రమే భారతమాత అని పిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బ్లురే హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి, సోము ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్, పెద్దాపురం సిఐ వి. జయకుమార్, ఎస్ఐ ఏ. బాలాజీ, నవసేన గోరింట గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment