అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాని ప్రారంభించిన ఎస్సై భూమేష్
మందమర్రి, పెన్ పవర్
ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాని సోమవారం పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అంబేద్కర్ యువజన సంఘం నాయకులను అభినందించారు. పట్టణ ప్రదాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎవరైనా ముందుకు వస్తే పోలీస్ శాఖ నుండి సహకారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చలివేంద్రాలను ధ్వంసం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరాస్వామి, పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు, నాయకులు, నెరువట్ల దేవయ్య, చీర్ల సత్యం, నర్సోజి, ఉప్పులేటి నరేశ్, జూపాక సంపత్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, రామ్ శ్రీనివాస్, కటిక శ్రీనివాస్, కాసిపేట రవి, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment