Followers

కళాభారతి లో ఘంటసాల కబడ్డీ.... కబడ్డీ......కార్యక్రమం

 కళాభారతి లో ఘంటసాల కబడ్డీ.... కబడ్డీ......కార్యక్రమం

విశాఖ,పెన్ పవర్ 

ఆదివారం సాయంత్రం విశాఖపట్నం మద్దిలపాలెం కళాభారతి నందు సిమ్ స్టీల్స్ - రైట్ కేర్ మరియు  వైజాగ్  రియల్ ఎస్టేట్ .కామ్ వారి సహకారంతో  సామాజిక ,విద్య , సాంస్కృతిక , సాహిత్య, స్వచ్చoధ కార్యకలాపాలు సంస్థ అయిన ఢిల్లీ అదిలీల ఫౌండేషన్ వారు మొట్ట  మొదటిసారిగా విశాఖలో వినూతన పద్దతిలో ఈ ఉత్సవాలను ఫౌండర్ మరియు జాతీయ అధ్యక్షుడైన డాక్టర్ ఎస్. ఆదినారాయణ మరియు రాష్ట్ర సమన్వయ కర్త  బాలాజీ రావు అధ్యక్షతన నిర్వహించారు.  

గంటసాల అవధాన స్రష్ట భిరుదాంకితులు డాక్టర్ ఎస్. రెహ్మాతుల్లా చేసిన ఘంటసాల గానావధానము కార్యక్రమంలో 20 మంది కళాకారులు పాల్గొని ప్రేక్షకుల ప్రశ్నలకు ధీటుగా సమాదానాలు చెప్పి ఒక్కొక్క పాటను వివరణతో తమ గాన మాధుర్యం తో ఎన్నో అనేకమైన మధురమైన ఘంటసాల సినిమా పాటలను పాడి అభిమానుల మనసులను దోచుకున్నారు. మరియు పద్మశ్రీ ఘంటసాల వారి పాటలతో కూడిన  నృత్యములు, మరియు కబడ్డి.....కబడ్డి.... అనే  వినూతన కార్యక్రమము ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

సభను అలంకరించిన పెద్దలందరూ ఘంటసాలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రెహ్మాతుల్లాకు   మెమోంటో ను ప్రదానం చేసి సాలువను కప్పి విశేషం గా సత్కరించి నగదు బహుమతిని అందించారు. అలాగే మరికొంతమంది సంస్థ అధ్యక్షులను, అతిథులను, సాలువలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిలుగా గౌరననీయులైన ఎం.ఎల్.సి.  శ్రీ  పి.వి.ఎన్. మాధవ్,  ఎంటర్టైన్మెంట్  ఇండస్ట్రీ  సి. ఇ. ఓ. అశోక్ మందాని జాతీయ అధ్యక్షుడైన ఎస్.ఆదినారాయణ  అతిధులుగా ఫార్మక్యూటికల్ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాస రెడ్డి ,  స్వాతి ప్రమోటర్స్ అధినేత ఎం. కృష్ణా రెడ్డి, రైట్ కేర్  మేనేజర్ జె.యు. చిరంజీవి , ఇంటర్నేషనల్ బాక్సర్  కోరుకొండ అరుణ లు హాజరయ్యి సభను జయప్రదం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...