శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల
జమ్మికుంట,పెన్ పవర్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రోజునా జరిగిన శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఈటల రాజేందర్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ని పురోహితులు వేద మంత్రాలతో ఘనంగా ఆహ్వానించారు, అనంతరం పూజా కార్యక్రమాలు చేయించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఈటల మాట్లాడుతూ శివయ్య ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే బోలా శంకరుడు అని అన్నారు, ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నానని అన్నారు, ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, శ్రీరామ్ శ్యామ్, ఆలయ కమిటీ, వార్డు కౌన్సిలర్ లు, నాయకులు మరియు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment