ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే సంకె శ్రీనివాస్ మృతి
మందమర్రి, పెన్ పవర్
ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే దళితుడైన సంకె శ్రీనివాస్ మార్చి 13 వేలాల జాతరలో మృతిచెందాడని వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు ఆరోపించారు.గురువారం వేలాల జాతర గోదావరి నది ప్రమాద స్థలాన్ని వారు సందర్శించారు. ప్రభుత్వము,ఇసుక రిచ్, జాతర నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే కుటుంబసమేతంగా పుణ్యస్నానాలు వెళ్లిన సంకె శ్రీనివాస్ గోదావరి నదిలో మృతి చెందాడని,జాతరకు వేలాది గా భక్తులు గోదావరి నది వద్ద వస్తారని తెలిసిన ప్రభుత్వం, జాతర నిర్వహకులు ఎలాంటి రక్షణ చర్యలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం మూలంగానే ప్రమాదం చోటు చేసుకుందని వారు అభిప్రాయ పడ్డారు. జాతర లో వచ్చే ఆదాయానికి ఇచ్చిన ప్రాధాన్యత, భక్తుల ప్రాణాలకు ఇవ్వలేదని ఆరోపించారు.ప్రమాదం జరిగిన అనంతరం ప్రభుత్వ అధికారులు హుటాహుటిన సూచిక బోర్డు, రక్షణ ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్న మృతుడు సంకె శ్రీనివాస్ కుటుంబాన్ని యొక్క ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శించ లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సంకె శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు అసాది మధు,మాజీ జిల్లా కార్యదర్శి మార్త కుమారస్వామి,ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరాస్వామి,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు గొడిసెల చంద్ర మొగిలి,జిల్లా కార్యదర్శి డుర్కే మోహన్, సిఐటియు జిల్లా కార్యదర్శి గూళ్ల బాలాజీ, భగత్ సింగ్ యువజన సంఘం అధ్యక్షుడు కనుకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment