సర్పంచ్ ముందు జాగ్రత్త !
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
సంతబొమ్మాళి,పెన్ పవర్
ముందుగా చెప్తే గాని పనులు జరగని ఈ రోజుల్లో, వచ్చిన సమస్యనే తీర్చలేని తీర్చ లేని ఈ రోజుల్లో ముందుచూపుతో పనులు చేస్తున్న సర్పంచ్ కు గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు. వివరాల్లోకి వెళితే సంతబొమ్మాళి మండలం, నౌపడ రక్షిత తాగునీటి పథకానికి వేసవి దృష్ట్యా ముందు జాగ్రత్తగా 58 వేల రూపాయలు ఖర్చుతో మోటారు,పంపు సెట్ కొనుగోలు చేశామని నౌపడ సర్పంచ్ పిలక బృందాదేవి, ప్రతినిధి పిలక రవి కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది వేసవి లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రావు కి మంగళవారం సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఏవీ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, వైకాపా కార్యకర్తలు లింగరాజు, అప్పలకొండ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment