భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతోంది..
దేశ స్వాతంత్ర్య సముపార్జనకు చేసిన త్యాగాలు మరువలేనివి..
ఫ్రీడమ్ రన్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్..
మేడ్చల్ , పెన్ పవర్
భారతదేశం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిన దేశమని... భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతూ, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ అన్నారు. బుధవారం కీసర ఆర్డీవో కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత స్వాతంత్ర్య భారతదేశంలో ఎంతో మంది మేధావులు, యువతీ యువకులు ఎన్నో కలలతో పుట్టినిల్లని భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతున్న దేశం భారతదేశమని కొనియాడారు. భారతదేశ చరిత్ర, స్వాతంత్ర్య సముపార్జనకు ఎందరో చేసిన త్యాగాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అదనపు కలెక్టర్ విద్యాసాగర్ అన్నారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు వారి త్యాగఫలితమేనని ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదని ఆయన పేర్కొన్నారు..అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ ) శ్యాంసన్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.. మార్చి 11వ తేదీ నుంచి నవంబర్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అదనపు కలెక్టర్ శ్యాంసన్ వివరించారు. భారత దేశ స్వాత్రంత్యం గురించి విద్యార్థినీ, విద్యార్థులు, యువతీ యువకులు ప్రతిరోజూ చర్చించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లింగ్యానాయక్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి, ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, జిల్లా అధికారులు, విద్యార్థులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment