Followers

లైసెన్స్ లు లేకుండా పురుగుమందులు అమ్మితే చర్యలు తప్పవు....ఏడీఏ పద్మశ్రీ

 లైసెన్స్ లు  లేకుండా పురుగుమందులు అమ్మితే చర్యలు తప్పవు....ఏడీఏ పద్మశ్రీ


పెన్ పవర్, కరప 

నిర్ధేశిత లైసెన్స్ లు లేకుండా ఎరువులు పురుగు మందులు అమ్మితే ఉపేక్షించేది లేదని అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కరప సబ్ డివిజన్ ఏడీఏ జీవీ పద్మశ్రీ హెచ్చరించారు. కరప శివారు పేపకాయలపాలెంలో శ్రీరామ ఫెర్టిలైజర్ షాప్ ని ఏవో ఎ. గాయత్రిదేవి తో కలిసి ఆమె తనిఖీ చేశారు. షాప్ డీలర్ ప్రిన్సిపల్ సర్టిఫికెట్ (పీసీ) లేకుండా ఎరువులు, పురుగు మందులు అమ్ముతున్నట్టు ఈ తనిఖీల్లో తేటతెల్లమయ్యింది. 

దీంతో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నట్టు నిర్ధారించి రూ.4.60లక్షల విలువైన సరుకును సీజ్ చేసి వాటి అమ్మకాలను నిలుపుదల చేశారు. ఇందులో రూ.3.98లక్షల విలువ చేసే 300 లీటర్ల పురుగు మందులు,  రూ.79వేలు విలువ చేసే  3.06 టన్నుల 10-26-26 రకం ఎరువులు ఉన్నట్టు ఏడీఏ తెలిపారు. ఆయా కంపెనీలు నుంచి పీసీ లు తెచ్చుకుని లైసెన్సులో నమోదు చేసేవరకు అమ్మకాలు చేయరాదని డీలర్ కు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...