బేటి బచావో బేటి పడావో కరపత్రాల విడుదల
ఆదిలాబాద్,పెన్ పవర్
జిల్లా బాలల పరిరక్షణ విభాగము, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కరపత్రాలను ఆదిలాబాద్ డి యస్ పి వెంకటేశ్వర్లు చేతులమీదగా శనివారం విడుదల చేశారు.డి యస్ పి మాట్లాడుతూ ఈ సమాజంలో ఆడపిల్లలని పుట్టనిద్దాం, చదువనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో లింగ వివక్షత లేకుండా బాలబాలికలకు సమాన అవకాశాలు ఇవ్వాలని విద్య, ఉద్యోగ, రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.బాలల అక్రమ రవాణాను నియంత్రించుటకు కలెక్టర్ చౌక్ లోని ఆటోలకు, బస్సు లకు పోస్టర్స్ అతికించరు.గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా పిల్లలను అపహరించడం, వివక్షకు గురి చేయడం గమనించినట్లయితే ఆటో డ్రైవర్లు 1098,100 సమాచారం ఇవ్వాలని డీఎస్పీ అన్నారు.
అదేవిధంగా బాల కార్మికులు, బాల్య వివాహాలు, వివక్షకు గురవుతున్న అటువంటి పిల్లలు, అక్రమ రవాణాకు గురవుతున్న అటువంటి పిల్లలు, బిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైనా తారసపడిన చో చైల్డ్ లైన్ 1098 కి కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ట్రాఫిక్ సీ ఐ గంగాధర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త తిరుపతి, పోలీస్,1098 సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment