రేషన్ సరుకుల విక్రయానికి అనుమతించాలని డీలర్ ఆందోళన
చిన్నగూడూరు,పెన్ పవర్
మండల కేంద్రంలోని విస్సంపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ షాప్ నెంబర్ 9 కి చెందిన రేషన్ డీలర్స్ అక్కినేని కవిత శనివారం మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్రం చేసిన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు కవిత విస్సంపల్లి గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం గతంలో రేషన్ షాప్ డీలర్ గా ఉన్న కవితను అభియోగం తో తొలగించడం జరిగిందని, దీంతో జయ్యారం డీలర్ నరహరికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. పది నెలల అనంతరం 2021 జూన్ నుంచి కవితకు జాయింట్ కలెక్టర్ నుంచి అనుమతి వచ్చిన తహసిల్దార్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో శనివారం స్థానికుల సహకారంతో తాసిల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలిపారు. గతంలో ఆర్ఐ కొంత మంది స్థానికుల సహకారంతో దొంగ తీర్మానం చేసి నరహరి రేషన్ షాప్ ను అప్పగించేలా సదర్ డీలర్ స్థానికంగా ఉండటం లేదనే నెపంతో తాసిల్దార్ కు మెమోరాండం ఇవ్వడంతో ఆర్ ఐ విషయం జరుగుతుందని ఎమ్మార్వో ముందు చింపి వేయడం జరిగింది. బాధితురాలు నాకు ఎలాగైనా న్యాయం చేయాలని ఈ సందర్భంగా తాసిల్దార్ వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాగంటి నరసయ్య, ధర్మారపు ఉపేందర్, కొండ వెంకన్న, భాశి పంగు ఎల్లయ్య, కొప్పల శ్రీను, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment