Followers

మానవత్వం చాటిన ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్


 మానవత్వం చాటిన ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్

కూకట్ పల్లి,పెన్ పవర్

ఆదిలోనే నయం అయే కొన్ని వ్యాధులను మొదటి దశలొనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా జీవితాలను కాపాడుకోవచ్చు అని ఆర్థోపెడిక్  డాక్టర్ సుధీర్ రెడ్డి  తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లా ఘాన్పూర్ చెందిన కవిత(28) అనే మహిళ గత 9సంవత్సరాలగా కాళ్ళనొప్పులతో బాధపడుతూ ఉంది. సరైన వైద్యం అందక డబ్బు చెలించలేని స్థితిలో కూకట్ పల్లిలోని హైదర్ నగర్ ల్యాండ్ మార్క్ హాస్పిటల్ కు రావడం జరిగిందని, అప్పటికే కవిత తనంత తానుగా నడవలేక, ఎటువంటి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. కవితను పరీక్షించిన డాక్టర్ సుధీర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీచరణ్ ఇతర వైద్యబృందం వైద్యం చేస్తాం కానీ ఏడూ లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు, దీనితో అంత డబ్బు లేదు అని తాను వైద్యులకు వివరించింది. దీనితో వైద్యులు సామాజిక బాధ్యతగా ఆమెకు ఆపరేషన్ ను ఉచితంగా నిర్వహించి దాతృత్వాన్ని చాటుకున్నారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో మోకాలి మార్పిడి చాలా అరుదుగా జరుగుతుంది అని డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఆమె వైకల్యాలను సరిదిద్దడానికి ఆసుపత్రిలో ఒక నెల కన్నా ఎక్కువ సమయం పట్టింది అని అన్నారు. నాలుగు నెలల్లో కవిత అందరిలాగానే నడుస్తుందని తెలియజేసారు. కవిత మాట్లాడుతూ తనకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్లు పునర్జన్మ ప్రసాధించారని, జీవితాంతం వారికి రుణపడి ఉంటానని అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...