Followers

ఉద్యోగుల వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

 ఉద్యోగుల వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి- టివిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ గౌడ్ 

తార్నాక, పెన్ పవర్ 

ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో నిరుద్యోగులకు శాపంగా మారిందని, పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, ఉద్యోగ క్యాలండర్ ప్రకటించి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని తెలంగాణ విద్యార్థి సమాఖ్య (టివిస్) రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు,నిధులు, నియామకాల కోసం అని కానీ ప్రస్తుతం ఇవన్నీ కేసీఆర్ కుటుంబనికే  పరిమితం అయ్యాయన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త కొలువులతో యువత భవిష్యత్ మారుతుంది అనుకుంటే ఈ ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి,కొత్త నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...