Followers

మహిళ అనుమానాస్పద మృతి

మహిళ  అనుమానాస్పద మృతి 

మహిళ పై సమూహికంగా అఘాయిత్యం చేసి ..హత్య చేసినట్లు పలు అనుమానాలు..

 పోలీస్ క్లూస్ టీం పరీశీలన..

మిష్టరీని చేదించేందుకు జిల్లా ఏఎస్పీ   యోగేష్ గౌతమ్

బయ్యారం, పెన్ పవర్


మహుబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జగ్ తండా పంచాయితి బీసీ కోలని లో గుర్తు తెలియని వ్యక్తులు బుదవారం రాత్రి  నిమ్మల యాకమ్మ (29)ను.  అతి కిరాతకంగా ఆమెపై  అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు కూలి పనులకు వెళ్లుతుండేదని.. భర్త రామారావు ఖమ్మం లో హమాలి పని చేస్తూ ఉండేవాడని భార్య భర్తలు చాలా ఆన్యోన్యంగా ఉండేవారని పేర్కొన్నారు. మృతురాలు ఆ కాలనీలో మరి కొంత మంది మహిళలతో
రాత్రి సమయాలలో ట్రాక్టర్లలో ఇసుక నింపేందుకు కూలీ పనులకోసం వెళుతుండేవారని తెలిపారు. ఇంత దారుణానికి ఎలా ఒడి గట్టి హత్య చేశారో తెలియడం లేదని.. హత్య జరిగిన సమయంలో ఇంటి చుట్టూ పక్కల ఇల్లు తాళాలు వేయడం... ఎవరు లేక పోవడంతో  మృతురాలిని ఇంటి పక్కనే నిర్థీవ ప్రాంతంలో హత్య చేసి.. ఇంటి వరండా బాగంలో నిందితులు  విద్యుత్ షాక్ తో  చని పోయే విదంగా  చిత్రీకరీంచే ప్రయత్నం చేసినట్లు కనపడుతుందని తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు సూర్య.. (08), చిన్న కుమారుడు ఆది (03), చిన్న కుమారుడు ఆనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. దీనిపై స్టానిక ఎస్ ఐ జగదీష్ తమ సిబ్బందితో మహిళ  అనుమానాస్పద మృతి  సంఘటణ ప్రాంతాన్ని పరిశీలించి,  విషయాన్ని జిల్లా పోలీసు అధికారులు తెలుపడంతో, జిల్లా ఏఎస్పి  యోగేష్ గౌతమ్ చేరుకొని క్లూస్ టీం తో ఫోరెన్సీ అధికారులు చేరుకొని ఆప్రాంతాన్ని క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం  కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...