Followers

ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించిన కూనా శ్రీశైలం..

 ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించిన కూనా శ్రీశైలం..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను బీజేపీ నాయకులు కూనాశ్రీశైలంగౌడ్ ఘనంగా నిర్వహించారు.. షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నారీ శక్తి సైనిక, వాయు, నావిక మరియు ఇతర రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, నావికా రంగంలో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో ప్రపంచంలో మొదటి సారిగా స్వర్ణ కృష్ణ అనే నౌక యాత్ర చేపట్టడం దీనికి నిదర్శనమని కూన శ్రీశైలంగౌడ్ గుర్తు చేశారు. కరోనా విపత్కర సమయంలో ఇంట్లో మహిళల పాత్ర ఎనలేనిదని వారి సేవలు ఎప్పటికీ మరువలేమని కొనియాడారు . తెలంగాణ రాష్ట్ర మహిళలకు మరియు బిజెపి మహిళా మోర్చా నాయకురాళ్ళకు కార్యకర్తలకు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలతో కలిసి కూనా కేక్ కట్ చేశారు.. ఈ కార్యక్రమంలో పద్మ, షబానా, కల్పన, దేవి ,రాధిక, మాధవి ,లావణ్య, పావని, మంగ, పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...