Followers

బడ్జెట్ లో విద్యారంగానికి తీరని అన్యాయం

 బడ్జెట్ లో విద్యారంగానికి తీరని అన్యాయం: ఏబీవీపీ



కూకట్ పల్లి, పెన్ పవర్

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి తీరని అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా శుక్రవారం జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరగడం పట్ల ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతు గతంలో విద్యారంగానికి బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించేవారని, ఆ పది శాతం నిధులు కూడా విద్యారంగాన్ని అభివృద్ధి చేయలేకపోయానని, అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు శాతం నిధులు విడుదల చేయడం నిజంగా బాధాకరమని అన్నారు. ఐదు శాతం నిధులు ప్రకటించడంతో విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు పడినట్లు అయిందని అన్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరగక, కనీస మౌలిక వసతులు లేక, అనేక ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే నూతన వసతిగృహాలు, నూతన కోర్సులను ప్రారంభించే ధైర్యం చేయలేక విశ్వవిద్యాలయ అధికారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఈబడ్జెట్ ద్వారా వచ్చే డబ్బులతో కనీసం అధ్యాపకుల జీతాలకు కూడా సరిపడని పరిస్థితి నెలకొందని అన్నారు.  జగిత్యాల జె.ఎన్.టి.యు, మంథని, సుల్తాన్పూర్ లలో కూడా కనీస అభివృద్ధిని చేయలేని పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం ఈ బడ్జెట్ పట్ల పునరాలోచించి విశ్వవిద్యాలయాల పట్ల తమ చిత్తశుద్ధిని వ్యక్తం చేసే విధంగా ఏదైనా పథకాన్ని ప్రారంభించి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని, అదే విధంగా తగిన నిధులను కేటాయించి విశ్వవిద్యాలయాలను కాపాడాలని కోరారు. ఈకార్యక్రమంలో విద్యార్థి నాయకులు జవ్వాజి. దిలీప్, చింతకుంట సాయికుమార్, తమిళనాడు జ్యోతి, రుత్విక్, వర్షిత్, రోహిత్, సూర్య, రామకృష్ణ, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...