క్షతగాత్రులను పరామర్శించిన కొలగట్ల శ్రావణి
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం మండలం లోని సుంకర పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం విచారకరమని విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. మంగళవారం నాడు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులు అయిన వారు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు.
మృతుల కుటుంబాలకు పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో ఆయా అవార్డుల కార్పొరేటర్లు శ్రీమతి బి. ధనలక్ష్మి, శ్రీమతి బాలి పద్మావతి, శ్రీమతి మీసాల రమాదేవి, శ్రీమతి తాళ్లపూడి సంతోష్ ని, టి సంధ్యారాణి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేస లి అప్పారావు, ఉన్నారు.ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సీతారామరాజు, డి సి హెచ్, మరియు వైద్య బృందం క్షతగాత్రుల కు చేసిన చికిత్సను, పరిస్థితిని వివరించారు.
No comments:
Post a Comment