Followers

కాంగ్రెస్ఎస్టీసెల్ నెల్లికుదురు మండల అధ్యక్షులుగా భాస్కర్ నాయక్

 కాంగ్రెస్ఎస్టీసెల్  నెల్లికుదురు  మండల అధ్యక్షులుగా భాస్కర్ నాయక్ 

నెల్లికుదురు,పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్  అధ్యక్ష ప్రధానకార్యదర్శులుగా రత్తిరామ్ తండాకు చెందిన గుగులోత్ భాస్కర్,వస్రం తండాకు చెందిన గుగులోత్ రవిలను నియమించినట్లు డిసిసి అధ్యక్షులుజెన్నారెడ్డి భరత్ చంద్రా  రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయక్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల హక్కుల కోసం ఉద్యమిస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి భాస్కర్,రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ మురళి నాయక్,డి సి సి ఉపాధ్యక్షులు ఎద్ఎ దళ్ళయాదవరెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్,నాయకులు దల్ సింగ్,గంకిడి ఎల్లారెడ్డి,మట్టవెంకట్ రెడ్డి,లింగ్యానాయక్,వీరన్న నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...