Followers

రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు గ్రామానికే వచ్చి కొనుగోలు చేస్తాం

 రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు గ్రామానికే వచ్చి కొనుగోలు చేస్తాం...

జైనథ్ మండల కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న

జైనథ్,  పెన్ పవర్ 

రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు కుడా ప్రభుత్వమే గ్రామనికే వచ్చి కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్  మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ మార్క్ ఫెడ్, పాక్స్ పిఎసిఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై  ప్రారంభించారు. తూకం యంత్రానికి పూజలు జరిపిన అనంతరం కొనుగోళ్లను ప్రారంభించారు. పలువురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా  జోగురామన్న మాట్లాడుతూ రైతులను ఆదుకావాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 5100 రూపాయల మద్దతు ధరతో తేమ శాతం 14కు మించకుండా ఉన్న పంటను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.   రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు సుప్రీమ్ కోర్ట్ స్టే ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పంటలను రైతుల వద్ద నుండి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజ రెడ్డి, జైనథ్ ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్,  జడ్పీటిసి అరుంధతి వెంకట్ రెడ్డి, ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, వైస్.ఎంపీపీ విజయ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ బాలురి గోవర్ధన్ రెడ్డి, గూడ పి.ఏ.సి.ఎస్ చైర్మన్, మెడిగుడా పి.ఏ సి.ఎస్ చైర్మన్ లు, మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ లింగారెడ్డి, మార్క్ ఫెడ్ డీఎం పుల్లయ్య, అగ్రికల్చర్ ఆఫీసర్ వివేక్, ఎమ్మార్వో మహేంద్రనాథ్, ఎం.పి.డి.ఓ  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...