ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
మందమర్రి, పెన్ పవర్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల వద్ద పన్నులు వసూలు చేస్తూ వారిని ఓటు బ్యాంకు లాగా వాడుకుంటున్నారని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మందమర్రి పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేడి రాజు ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోజువారి వచ్చే రెండు వందల నుండి నాలుగు వందల రూపాయల సంపాదనతో చాలీచాలని జీవితం గడుపుతూ ఆటోడ్రైవర్లు ఇంటి అద్దెలు, కరెంట్, వాటర్ బిల్లులు, పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్య పరిస్థితులు చూసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని, దీనికి తోడు లాక్ డౌన్ వలన ఆగిపోయిన ఆటో కిస్తీలు కట్టలేక,దినదినం ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు, ఆటో స్పేర్ పార్ట్స్ ధరల పెరుగుదలతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి మార్చి 5న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగిందని బంద్ కు ప్రజలందరూ మద్దతు తెలిపి ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాల్సిందిగా కోరారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి,ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయాలని డిమాండ్ చేశారు.పెరిగిన ధరలను తగ్గించి,పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆటోడ్రైవర్లకు ఇచ్చినట్లు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు.పర్మిట్ పూర్తయిన పాత ఆటోలను గుర్తించి వాటి స్థానంలో కొత్త ఆటోలను ఇచ్చి ఆదుకోవాలని, ఫైనాన్స్ వేధింపులను అరికట్టి, బ్యాంకులలో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్లు సహజంగా చనిపోతే 15 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 25లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా అన్ని జిల్లా,పట్టణ,మండల కేంద్రాలలో ఆటో నగర్ లు ఏర్పాటు చేసి,ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిర్వహించు జిల్లా వ్యాప్త బంద్ కు జిల్లాలోని ఆటో డ్రైవర్లు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి, స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఉప్పరి సుభాష్, కొప్పుల రమేష్, కోశాధికారి ఎండి షరీఫ్, ప్రచార కార్యదర్శి దాసరి రాజ్ కుమార్, కార్యదర్శి బొల్లు రవి,ఆటోడ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment