Followers

ప్రాచీన కోలాట కళకు దక్కిన అరుదైన గౌరవం

 ప్రాచీన  కోలాట కళకు దక్కిన అరుదైన గౌరవం.

రావిరాల కోలాట కళాకారిణి "హైమ"కు స్పూర్తి రత్న అవార్డు..


నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్  జిల్లా నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామానికి చెందిన శ్రీనివాస భజన మండలి అధ్యక్షురాలు,  కోలాట కళాకారిణి జిలకర హైమ కు స్ఫూర్తి రత్న అవార్డు, ఉగాది పురస్కారంల తో పాటు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులోచోటు దక్కించుకుంది.ఉగాది పురస్కరించుకుని శ్రీ సుధా సేవాసమితి వారుసంబంధిత అవార్డులను కాజీపేటలోని బాలవికాస కార్యాలయంలో ఆదివారం రెడ్ క్రాస్ చైర్మన్ విజయ్ చందర్, సేవా సమితి అధ్యక్షురాలు సుధా మాధురి ల చేతులమీదుగా హైమ కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత జిలుకర హైమ  హైమ సోమవారం ఎక్కడ  మాట్లాడుతూ...పూర్తి రత్న అవార్డు తో పాటు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కడం ఆనందంగా ఉందని దీంతో నా తోటి కళాకారులకు ప్రేరణ కలుగుతుందన్నారు.ను  అవార్డుకు ఎంపిక కావడం వెనుక తోటి కళాకారులతో పాటు గ్రామస్తుల ప్రోత్సాహమే కారణం అన్నారు. కార్యక్రమంలోటివి  అశోక్ కుమార్,సేవా సమితి కార్యదర్శి రమేష్ నిమ్మల శ్రీనివాస్ పద్మావతి ప్రముఖ గాయకుడు ప్రణయ్ కుమార్ బీసీ సెల్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...