Followers

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీరామూర్తి

 నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీరామూర్తి


లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలోని శివాజీ నగర్ కి చెందిన నిరుపేద వికలాంగుడు పడాల శంకర్ కి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం క్లబ్ అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామూర్తి ట్రైసైకిల్ ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్ కు గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం కావడంతో ఆప్రమాదంలో తన కాలు పూర్తిగా తీసివేయడం తో,ఇట్టి విషయం పలువురి ద్వారా తెలిపడంతో తనకు హైదరాబాద్ నుండి క్లబ్ ట్రై సైకిల్ మంజూరు చేయడంతో లబ్దిదారునికి అందజేయడం జరిగిందన్నారు. అనంతరం పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన నిరుపేద కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మాణంకు  రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.నిరుపేద బ్రహ్మయ్యకు చిన్న గుడిసె ఉందని మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్నా రోటరీ క్లబ్ సుమారు ఇరవై వేల రూపాయలతో మరుగుదొడ్లు నిర్మాణం కోసం ముందుకొచ్చి భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లు క్లబ్ అధ్యక్షుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి మేనేజర్  నవీన్ కుమార్,క్లబ్ సభ్యులు చింతల శ్రీనివాస్, పలేర్లమనోహర్, కిషన్, గంగన్న, సాగర్, సుమతి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...