బేల మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్
అదిలాబాద్,పెన్ పవర్
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు బుధవారం బేలా మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం లో మండల విద్యాశాఖ అధికారి గా ఉన్న అతను బేల మండల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో బాధ్యతలు స్వీకరించి సంతకాలు చేశారు. నూతన మండల విద్యాశాఖ అధికారి కి ఎం ఆర్ సి సిబ్బంది స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బేలా జడ్.పి.హెచ్.ఎస్ ఇంచార్జి హెడ్ మాస్టర్ రాహుత్ రాజ్ కుమార్, ధోప్టలా హెడ్ మాస్టర్ చొప్డే రాజు, పీడీ దర్శనలా దేవేందర్, మండల వనరుల శాఖ సి ఆర్ పి లు రాకొండే వెంకన్న,విజయ్,రేణుకా, సిబ్బంది అతుల్, మిథున్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment