ఘనంగా ఉరుసు మహోత్సవాలు ప్రారంభం
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం బాబామెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో సూఫీ మహనీయులు హజరత్ ఖాదర్ వలి బాబా వారి 62 వ మహా సూఫీ సుగంధ మహోత్సవాలు మంగళ వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్గా, దర్బార్ షరీఫ్ షా ముతావల్లి(ధర్మ కర్త), ఖాదర్ బాబా వారి ప్రియ శిష్యులు, సూఫీ మహాత్మ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఉరుసు మహోత్సవాలను ప్రారంభించారు. దర్భార్ నుంచి అతావుల్లా బాబా కుమారులు జాఫర్ సాధిక్, ఎండీ ఖ్వాజా మోహిద్దీన్, డాక్టర్ ఎండీ ఖలీలుల్లా షరీఫ్, తాజ్ ఖాదర్ తదితరులు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్, గంధం, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలను ఫకీర్ల ఖవ్వాలీ, మేళ తాళాలుతో దర్గా వద్దకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. దర్గాలోని ఖాదర్ బాబా కి ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన జెండాను ఆవిష్కరించి ఉరుసు మహోత్సవాలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. తదుపరి దర్భార్ లోని లంగర్ ఖానాలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.
బాబాని దర్శించుకున్న ప్రముఖులు..
ఖాదర్ బాబా ఉరుసు మహోత్సవాల్లో భాగంగా దర్గా, దర్బార్ నిర్వాహకులు డాక్టర్ ఖలీల్ బాబు ఆహ్వానం మేరకు తొలి రోజు ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ఖాదర్ బాబాను, ఆయన శిష్యులు అతావుల్లా బాబాను దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి దర్భార్ ను సందర్శించారు. ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఉత్సవ కార్యక్రమాలను ఖ్వాజా బాబు, ఖళీల్ బాబు తదితరులు ఆమెకు చూపించారు.
అక్కడ జరుగుతున్న సేవలని వివరించారు. అతావుల్లా బాబాను దర్శించిన ఎస్పీ రాజకుమారి అతడి ఆశీర్వచనాలను పొందుకున్నారు. దర్బార్ లోని ఖాదర్ బాబా మందిరంలో ఎస్పీ బి రాజకుమారి ప్రార్ధనలు చేశారు. అనంతరం లంగర్ ఖానాలో భక్తులకు ప్రసాదం వడ్డన చేశారు. ఆమెతో పాటు డిఎస్పీ అనిల్ , పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమారై అధితి గజపతి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. బాబా ను దర్శించి ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు.
No comments:
Post a Comment