Followers

హిందూ ధర్మ ప్రచార యాత్ర

  హిందూ ధర్మ ప్రచార యాత్ర

విజయనగరం,పెన్ పవర్

 హిందూ ధర్మ ప్రచార యాత్ర లో భాగంగా విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేoద్ర స్వామి వారు జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణం చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. మంగళవారం నాడు పూల్ బాగ్ రోడ్ లోని కుసుమ హరనాథ్ క్షేత్రం వద్ద విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, శాసనమండలి సభ్యులు డాక్టర్ కె.వి సూర్యనారాయణ రాజు, ధార్మిక సేవా సంస్థల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

 గజమాలతో ఎమ్మెల్యే కోలగట్ల స్వామి వారిని సత్కరించారు. అనంతరం ఆయన స్టేడియం రోడ్ లో ఉన్న క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వాత్మ నం దేoద్ర స్వామివారు పాల్గొంటారు. స్వామివారికి ఆహ్వానం పలికిన వారిలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ  ట్రస్టు బోర్డు సభ్యులు , శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం బోర్డు సభ్యులు, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, ఆయా ఆధ్యాత్మిక సేవా సంస్థల ప్రతినిధులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...