రెల్లి కులస్తులకు ప్రాధాన్యత కల్పిస్తోన్న సీఎం జగన్ కు ధన్యవాదాలు
విశాఖపట్నం, పెన్ పవర్
ఎన్నో ఏళ్లుగా దళితుల్లో దళితులుగా అణగారిన వర్గాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ రెల్లి కులస్తులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి రాజకీయరంగంలో సముచిత స్థానం కల్పిస్తో నందుకు రాష్ట్ర వ్యాప్త రెల్లి కులస్తుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిన్న వాల్తేర్ లోని రెల్లివీధి గ్రామ అధ్యక్షుడు డాక్టర్. చెన్నా గౌరీ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పిటిసి, కార్పొరేటర్ టికెట్లను అధికశాతం తమ ఎస్సి రెల్లి కులస్తులకు కేటాయించడమే కాకుండా వారిని గెలిపించినందుకు రెల్లి కులస్తులు అందరూ వైఎస్ఆర్సిపి పార్టీకి రుణపడి ఉంటామన్నారు. ఇంతకు మునుపు వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోనే రెల్లి కులస్తుల అభివృద్ధి సాధ్యపడిందన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదరిస్తున్న జగన్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖ నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఇతర సీనియర్ నాయకుల అండదండలతో రెల్లి కులస్తులకు మునుముందు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని డాక్టర్. చెన్నా గౌరీశంకర్ ఆశాభావం వ్యక్తపరిచారు.
No comments:
Post a Comment