సిపిఎం..సిపిఐ ఆధ్వర్యంలో..భారత్ బందు ర్యాలీ..
రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి..
ప్రభుత్వ గోదాములు మూతపడి.. కార్పోరేట్ గోదాములు ప్రత్యక్షం అవుతాయి..
సిపిఎం సిపిఐ కుత్బుల్లాపూర్ మండల కమిటీలు ఆధ్వర్యంలో రైతు సంఘాల పిలుపుమేరకు భారత్ బంద్ లో భాగంగా షాపూర్ నగర్ లో షాపులు బంద్ చేయించి మెయిన్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు.. ఈ బంధు కార్యక్రమంలో సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ యూసుఫ్, సిపిఎం మండల కార్యదర్శి కీలు కానీ లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు.. కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నుండి ఆందోళన చేస్తుంటే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోగా ఆందోళన చేస్తున్న రైతులపై వివిధ రూపాల్లో నిర్బంధం విధిస్తున్నారని పేర్కొన్నారు.. ఈచట్టం దేశంలో అమలైతే రైతు పండించిన పంటలు అమ్ముకునే మార్కెట్ యార్డులు ప్రభుత్వ గోడౌన్లు మూతపడి కార్పొరేట్ గోడౌన్లు ప్రత్యక్షమవుతాయని, ఈ గోడౌన్లు దోపిడికి, మోసాలకు, దౌర్జన్యాలకు, కేంద్రాలుగా ఉంటాయని, బక్కచిక్కిన రైతు బెంబేలెత్తి తాను పండించిన పంటను కార్పోరేట్ సంస్థలు చెప్పిన ధరకు అమ్మ వలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే దేశవ్యాప్తంగా రైతు మార్కెట్ బచావో, కిసాన్ బచావో, అనే నినాదంతో ఉద్యమం కొనసాగిస్తున్నారని, మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న 2020 విద్యుత్ సవరణ చట్టం, రైతులకు పేదలకు పూర్తిగా వ్యతిరేకమైనదని, ప్రస్తుతం రైతులు పొందుతున్న రాయితీలను ఎగర గొట్టే ప్రయత్నంలో ఇది ఒక భాగమని పేర్కొన్నారు.. ఈ చట్టం ద్వార పేద ప్రజలు పొందుతున్న రాయితీలు కోల్పోతారని, 2020 విద్యుత్తు చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. మూడు రైతు నల్ల చట్టాలు 2020 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయకపోతే పేదలను కార్మికులను రైతులను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని పేదలకు రైతులకు హాని చేసే చట్టాలను రద్దు చేసే ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలని అన్నారు.. టిఆర్ఎస్ పార్టీ పేదల రైతుల పక్షమో..? లేదా పేదలను రైతులను ముంచే బీజేపీ పక్షమో తేల్చుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కీలు కానీ లక్ష్మణ్ మండల కమిటీ సభ్యులు బి. సత్యం కే. బీరప్ప జి. అశోక్ పి. అంజయ్య పి. శంకర్ సిపిఐ నాయకులు కే. స్వామి హరినాథ్, వెంకట్ రెడ్డి, రాము సదానంద్, చంద్రకాంత్, భూపాల్, జయరాజు, అశోక్ రెడ్డి, ఆంజనేయులు భాష కే శీను, తదితరులు పాల్గొన్నారు. ఇట్లు అభినందనలతో కీలు కానీ లక్ష్మణ్ సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి.
No comments:
Post a Comment