పలు చోరీకేసులో ఇద్దరు నిందితుల అరెస్టు..
47 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
ఐదు రోజులకే చోరీ కేసును ఛేదించిన పోలీసులు
త్వరితగతిన విచారణ చేయడంతో చోరీ సొత్తు స్వాధీనం
రెండు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు , వెండి వస్తువులు రికవరీ
సత్యవేడు పోలీస్ అధికారులకు బాధితులు జేజేలు...
పెన్ పవర్,సత్యవేడు
చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్లో నమోదైన పలు చోరీకేసులో ఇద్దరు నిందితులను స్థానిక పోలీసు అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 47 గ్రాముల బంగారు ఆభరణాలు ,20 గ్రాముల వెండితో పాటు చిన్నపిల్లల హీరో సైకిల్ , ఒక ఐరన్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు .శుక్రవారం చోరీకేసులో స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులను స్థానిక పోలీస్ స్టేషన్లో పుత్తూరు డిఎస్పి యశ్వంత్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ శ్రీనివాసులు ,ఎస్సై నాగార్జున రెడ్డి బృందం మీడియా ముందు ప్రవేశ పెట్టారు .ఈ సందర్భంగా డిఎస్పి యశ్వంత్ మాట్లాడుతూ గత నెల 27వ తేదీన సత్యవేడు మండలం అల్లపుగుంట అంకమ్మ దేవాలయంలో కొందరు దుండగులు ప్రవేశించి బంగారు ఆభరణాలను అపహరించినటు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది అన్నారు .దీనిపై జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసు అధికారులు పుత్తూరు నేరవిభాగ బృందంతో కలిసి విచారణ ప్రారంభించినట్టు చెప్పారు .గంగమ్మ గుడిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులకు సంబంధించిి పాత నేరస్తుల పాత నేరస్తుల ఫోటోలతో నిందితులను గుర్తించడం జరిగిందన్నారు .ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తమిళనాడు సరిహద్దు ఆర్బి ఫ్యామిలీ డాబా వద్ద నిందితులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది అన్నారు .అప్పటికే ఒకరు తప్పించుకుని పరారు కాగా మిగిలిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు .ఇందులో సత్యవేడు మండలం వెంకటాపురం ఎస్టి కాలనీకి చెందిన తుపాకుల వెంకటేష్(21), తమిళనాడు గుమ్మడిపూడి తాలూకా మానెల్లూరు ఎస్టి కాలనీకి చెందిన చిన్న(25) ఉన్నట్టు ఆయన వివరించారు .వీరిని విచారించగా సత్యవేడు పట్టణం గాంధీ రోడ్డు ,కోటమిట్ట కాలనీలో చోటు చేసుకున్న దొంగతనాలు తామే చేసినట్టు అంగీకరించినట్టు ఆయన చెప్పారు . అల్లపుగుంట గుడి చోరీకి సంబంధించి ముప్పై రెండు గ్రాముల బంగారు ఆభరణాలలో మూడు బంగారు గిన్నె బిట్లు , రెండు బంగారు బూట్లు ,మూడు బంగారు ముక్కు పుడకలు , మరో రెండు కేసులు 12 గ్రాముల బంగారు చైను ,మూడు గ్రాముల బంగారం నిందితులు నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు .వీటి విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటుందన్నారు . పరారైన నిందితుని త్వరలో పట్టుకుంటామని స్పష్టం చేశారు .అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాల కేసులను ఫిర్యాదు అందిన రెండు మూడు రోజుల్లోనే చేధించడానికి వీల్ అయిందన్నారు .అలాగే ప్రతి గ్రామంలోనూ విలేజ్ డిఫెన్స్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు .ఇప్పటికే పుత్తూరు నగిరి ప్రాంతాల ప్రధాన రోడ్డు మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా , త్వరలోనే నాగలాపురం ,వరదయ్యపాలెం ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు .అయితే నాగలాపురం మండలంలో సురుటుపల్లి , నాగలాపురంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పనిచేసే ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో దీని ద్వారా వాహనాలు నెంబర్ను కూడా గుర్తించడానికి సులువు అయింది అన్నారు .ఈ సమావేశంలో ట్రైనింగ్ ఎస్ఐ మధు రామచంద్రుడు , ఏఎస్ ఐ భాస్కర్ ,దయానిధి నాయుడు , రెడ్డి శేఖర్ , గంగాధరం ,మురళి ,దేవేంద్రనాయక్ , మనీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment