Followers

మూడు నల్లా రైతు చట్టాలను రద్దు చేయాలి

 మూడు నల్లా రైతు చట్టాలను రద్దు చేయాలి...

ఇచ్చొడ,  పెన్ పవర్

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధివిధానాలను నిరసిస్తూ శుక్రవారం  ప్రజా సంఘాలు చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా వారికి మద్దతుగా మండలంలోని సి.పి.ఎం,భీం ఆర్మీ, కాంగ్రెస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా సి.పి.ఎం జిల్లా నాయకుడు జితేందర్ పవార్ మాట్లాడుతూ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న వారిలో దాదాపు 300 మందికిపైగా రైతులు చనిపోయిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని,ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని మూడు నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని అన్నారు.అలాగే పెంచిన నిత్యవసరాల ధరలతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ షాదుల్లా , సయ్యద్ నౌషాద్ భీం ఆర్మీ అధ్యక్షుడు,షేక్ జఫ్ఫార్ ఎ.ఐ.ఎం.ఐ.ఏం, శివాజి, అబ్దుల్ సత్తార్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...