Followers

మురికివాడలలో స్థల వివాదాలు పరిష్కరించి పట్టాలు ఇప్పించాలన్నదే మా ద్యేయం...కె కె రాజు

 మురికివాడలలో స్థల వివాదాలు పరిష్కరించి పట్టాలు ఇప్పించాలన్నదే మా ద్యేయం...కె కె రాజు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు 55 వార్డు గాంధీనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జీవనోపాధి కోసం సంచార జీవులుగా ఇక్కడి కి వచ్చి ఎన్నో ఏళ్లుగా వుంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని కానీ ఇక్కడ రైల్వే వారితో కొన్ని స్థల వివాదాలు కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఈ సమస్యలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ద్వారా రైల్వే అధికారులతో మాట్లాడటం జరిగిందని అన్నారు. 

రైల్వే డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్సు తీసుకొని ఇక్కడ పట్టాలు ఇప్పించి, మరిన్ని మౌలిక వసతులు కలి పించటమే  మా ద్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 55 వార్డు కార్పొరేటర్ శశికళ, రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాస్, సిద్ధార్థ్, భద్రి,సురేష్,బసవ శివప్రసాద్ రెడ్డి, బోర ఈశ్వర్ రెడ్డి, ఎరం శేట్టి శ్రీనివాస్, వై.వి.ఎన్. రాజు.ఎండీ గౌస్, లక్ష్మి, సి.ఓ. వరలక్ష్మి,జీవీఎంసీ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...