Followers

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

 మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

పెద గంట్యాడ, పెన్ పవర్

ఇటీవల జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ బాడీ బిల్డర్ లు తమ సత్తా చాటారు. 85 కేజీల విభాగంలో లో సూర్య గోల్డ్ మెడల్ సాధించాడు.75 కేజీల విభాగంలో రాము ఆరవ స్థానంలో నిలిచాడు. పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రైస్ లో 120ప్లస్ కేజీ ల విశాఖ డిస్టిక్ లో సతీష్ గోల్డ్ మెడల్ సాధించగా,  ఆంధ్ర బాడీ లిఫ్టింగ్ లో ఐదవ స్థానంలో పండు యాదవ్ గెలుపొందాడు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు ధర్మాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాడీ బిల్డర్ లకు సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ రెడ్డి మాట్లాడుతూ యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతి ఒక్కరి పేరు పై దృష్టి సాధించాలని అని అన్నారు. 

నే వి, ఆర్మీ, బి ఎస్ ఎఫ్, సీ ఐ ఎస్ ఎఫ్, పోలీస్ వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయని అని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్రయత్నించాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిమ్ అధినేత ఆర్మీ రాజు, ఎమ్మెల్యే మహేష్, ములకలపల్లి ఈశ్వరరావు, ప్రసాద్, తేజ, గోవింద్ వంశీ, బుజ్జి, దుర్గ, ఎల్లాజీ, దినీష్  జిమ్ యువకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...