ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలి
విజయనగరం,పెన్ పవర్నగరంలో ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బకాయిలను,మొండి బకాయిలను యుద్ధప్రాతిపదికన వసూలు చేయాలని ఆదేశించారు. ఈ విషయమై ప్రతిరోజు సిబ్బంది నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితంగా పన్ను వసూలు చేయాలని అన్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యతలను ఆయా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తీసుకోవాలని చెప్పారు. లేనియెడల సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సాయి, తదితరులతోపాటు వార్డు కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
No comments:
Post a Comment