Followers

గంటా నూకరాజు,గంటా అప్పలకొండ లను ఘనంగా సన్మానించిన...తగరపువలస జ్యూట్ కార్మికులు

గంటా నూకరాజు,గంటా అప్పలకొండ లను ఘనంగా సన్మానించిన...తగరపువలస జ్యూట్ కార్మికులు

భీమిలి, పెన్ పవర్


విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో భీమిలి జోన్ 3వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి అఖండ విజయం సాధించిన గంటా అప్పలకొండ,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు  గంటా నూకరాజు దంపతులను  సోమవారం  తగరపువలస జ్యూట్ కార్మికులు,స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో   ఘనంగా సన్మానించారు.సామాన్య కుటుంబంలో పుట్టి, రాజకీయ అరంగేట్రం చేసి మున్సిపల్ కౌన్సిలర్ నుండి,  భీమిలి పట్టణ అధ్యక్షులుగా,రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా  భీమిలి నుండి  స్టేట్ కమిటీలో స్థానం పొందిన మొదటి వ్యక్తి గంటా నూకరాజు అని  కార్మికులు కొనియాడిరి.  ఇప్పుడు కార్పోరేటర్ గా తన గంటా అప్పలకొండను 3వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి జిల్లాలోనే మంచి మెజారిటీ వచ్చిన అభ్యర్ధినిగా గంటా అప్పలకొండ నమోదయ్యారని అన్నారు.ఎల్లప్పుడూ గంటా నూకరాజు ప్రజలతో మమేకమై ఉంటారని,ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ పరిష్కారం కోసం ముందుంటారని,ఇలాంటి వారికి ప్రజల గుండెల్లో పదిలంగా స్థానం ఉంటాదని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అని అన్నారు.ఇంకా గంటా నూకరాజు ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తున్నామని జ్యూట్ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ  సందర్భంగా ప్రత్యేకమైన అభిమానంతో మమ్మల్ని అభినందించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి నమష్కారాలు తెలియజేస్తున్నామని గంటా నూకరాజు అన్నారు.ఈ  కార్యక్రమంలో జ్యూట్ కార్మికులు వి.ఎస్.ఎ.ఎన్. రాజు,వి.రాంబాబు,ఎమ్.అప్పలాచారి, ఎస్.వెంకటరమణ,పి.శివ,ఎమ్. శంకర్ రావు, డి.ఎమ్.చంద్రశేఖర,ఎమ్. చంద్రశేఖర్,విజయ్ కుమార్, మల్లిఖార్జున రావు,సోమేశ్వరావు, ఎల్లాజి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...