Followers

వడ్డిగూడెం పంచాయతీ సంతపాటలు

 వడ్డిగూడెం పంచాయతీ సంతపాటలు

వి.ఆర్.పురం,పెన్ పవర్

వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామపంచాయతీ సంబంధించిన సంత పాటలు   మండలం ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వారు.నిర్ణయించిన సంత పాట విలువ 60.000 పంచాయతీలో నివసించే గిరిజనులు మాత్రమే ఈ సంతపాట కైవసం చేసుకోవటానికి అర్హులు. పంచాయతీ  పరిధిలో ఉన్న గ్రామాలు వారు. ఎవరైనా గిరిజనులు మాత్రమే సంతపాట పాడాలి. సంత పాట లో పాల్గొనేవారు ఐదు వేల రూపాయలు డిపాజిట్ కట్టి పాట లోపాల్గొనాలి. 60 వేల రూపాయలనుండి ఎక్కువగా ఎవరు  పాడతారో వారికి సంత పాట ఇవ్వటం జరుగుతుందని ఆయన అన్నారు.  శనివారం వడ్డిగూడెం గ్రామపంచాయతీ  నుండి ఏడుగురు గిరిజనులు  డిపాజిట్ కట్టి పోటాపోటీగా సంత పాటలో పాల్గొన్నారు.  అందులో పిట్ల రామారావు  లక్ష  10.000 కి సంత పాట పాడి కైవసం చేసుకున్నారు. ఆరోజే సంతపాటతో వేరుగా నాలుగు రూములు పాట పెట్టడం జరిగింది. ఆ రూములను నలుగురు గిరిజనులు ఒక్కొక్కరూము 8.000 చొప్పున సంత పాట పాడి కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఏన్. శ్రీధర్, వి.ఆర్.పురం ఎస్ ఐ చంటి, గ్రామపంచాయతీ సెక్రటరీ సురేష్ రెడ్డి, పంచాయతీ సర్పంచ్ సోడి నరసమ్మ, వడ్డీ గూడెం పంచాయతీకి సంబంధించిన గ్రామ వాలంటరీ లు రెవిన్యూ సిబ్బంది. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...