ఎస్. ఐ మెస్రం చంద్రబాన్ మరణం పై గాదిగుడా ప్రధాన్ సమాజ్ రెండు నిమిషాల మౌనం
గాదిగుడా, పెన్ పవర్మండలంలోని దాభా(కె) గ్రామమున ఎస్. ఐ మెస్రం చంద్రబాన్ శ్రదంజలి జరుపుకోవాలని ప్రధాన్ సమాజ్ అధ్యక్షుడు కోడప దేవ్ రావు ఆదేశాలను అందుకున్న ప్రజలు దాని విజయవంతం చేయడానికి స్వచ్చందంగా ముందుకొచ్చారు.బుధవారం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణాలు లెక్క చేయని ఎస్. ఐ చంద్రబాన్ గారు,ఒకరికోసం చేసే త్యాగం ఉనతమైనదైతే ప్రజరక్షణ కోసం చేసే త్యాగం మహోనతమైనదని సమాజ్ అధ్యక్షుడు కోడప దేవ్ రావు గారు అన్నారు.ప్రజల శ్రేయస్సు కొరకు పాటు పడాలని ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తా శుద్ధి నీతి నిజాయితీతో పని చేయాల్సి ఉంటుందన్నారు.మంచి పనులను ఎప్పటికి మరవలేమని ఆయన మన మధ్య లేననుకున్న మనం ఆయనని స్మరిస్తూనే ఉంటామని యూత్ అధ్యక్షుడు ఆర్కా జ్ఞానేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి కూడమేత భారత్, కుంర గంగారాం, మెస్రం గోవింద్ రావు, సిడం సీతారాం, నైతం గోవింద్ రావు, కోడప గణ్ పత్, సోయం సీతారాం, సోయం దశరథ్, అలాగే యూత్ కార్యకర్తలు పర్చకి లక్ష్మణ్,నైతం ఈశ్వర్,ఉయ్క తిరుపతి, కోడప ఉత్తమ్, తదితర సమాజ్ పేదలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment