రైతుల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పాలన
జగిత్యాల ,పెన్ పవర్
గ్రామాల సంపూర్ణ అభివృద్దే మా లక్ష్యం బుగ్గరాం మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో బుగ్గరాం మండల జెడ్పిటిసి బాధినేని రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది రైతుల రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల సంక్షేమమే ద్యేమంగా పాలన సాగిస్తున్నారని బుగ్గరాం మండల జెడ్పిటిసి బాధినేని రాజేందర్ అన్నారు. సోమవారం బుగ్గరాం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బాదినేని రాజమణి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను తొలగించే విధంగా రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్, రైతు భీమ, రైతుబంధు, సకాలలంలో పేదింటి ఆడ్డబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ షాదముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు సిఎం గారి మానసపుత్రిక మీషన్ భగీరధ పధకం ద్వారా ప్రతి ఇంటికి ఉచింతగా నల్లకనేక్షన్ తో పాటు స్వచ్చమైన త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ అభివృద్దే లక్ష్యంగా తాము పాలన చేస్తున్నమని గ్రామంలో సమస్యలను ఒకోక్కటిగా పరిష్కారం చేస్తు ముందుకు సాగుతున్నామన్నారు. ఆరేళ్ళ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని బంగారు తెలంగాణ సాధనలో తమవంతు పాత్ర పోషించామన్నారు ఈ సమావేశంలో వైస్ ఎంపిపి జోగినిపెల్లి సుసెంధర్ ఎంపీపీ కో ఆప్షన్ సభ్యులు రహమాన్ బుగ్గరాం మండల రైతు బంధు అధ్యక్షులు సత్యనారాయణ రావు మండలక్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ మండల ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షులు గాలిపెళ్లి మహేష్ తహశీల్దార్ పారఖ్ ఎంపీడీవో తిరుపతి ఎంపీఓ అబ్దుల్ మియా వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment