కొంపల్లి మున్సిపల్ పలు వార్డులలో కమీషనర్ రఘు పర్యటన..
సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన..
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం..
మరికొన్ని సమస్యలు కౌన్సిల్ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామని కమీషనర్ రఘు తెలిపారు..
దుండిగల్, పెన్ పవర్
కొంపల్లి పురపాలక సంఘం పరిధిలో కమీషనర్ రఘు.. చైర్మెన్ శ్రీశైలం యాదవ్ తో కలిసి వార్డుల వారిగా ఉన్న వివిధరకాల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు సోమవారం విస్తృతంగా పర్యటించారు.. సోమవారం 8,9, మరియు 10 వ వార్డులలో పర్యటించి సంబందిత వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, కమీషనర్ జి.రఘు 8వ వార్డు కౌన్సిలర్ ఎ.రజిని, 9వ వార్డు కౌన్సిలర్ ఆదిరెడ్డి రాజిరెడ్డి మరియు 10వ వార్డు వార్డు కౌన్సిలర్ తాళ్ల కృష్ణవేణి.. మరియు సంబంధిత మునిసిపల్ సిబ్బందితో కలిసి పర్యటించారు.. వార్డులలో ఉన్న సమస్యలను కమీషనర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.. ఈమూడు వార్డులలో ఉన్న ప్రధాన సమస్యలను కౌన్సిలర్లు, కమీషనర్ దృష్టికి తీసుకొచ్చారు.. వెంటనే స్పందించిన కమిషనర్ రఘు..మున్సిపల్ అధికారులకు వార్డులలో నెలకొని ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం కొరకు కౌన్సిల్ సమావేశములో చర్చిస్తామని పేర్కొన్నారు.. సమస్యలుపై చర్యలు చేపట్టవలసిందిగా సంబధిత శాఖ అధికారులను కమీషనర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, కమీషనర్ , కౌన్సిలర్లతోపాటు వివిధ శాఖల మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment