జొన్నాడ లో నూతన ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణం
పెన్ పవర్,ఆలమూరు
ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ని గురువారం ప్రారంభించారు స్థానిక ఆంధ్రా బ్యాంక్ సమీపంలో దీనిని ఎలక్ట్రికల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పనులు పూర్తి చేశారు గ్రామంలో విద్యుదీకరణ లో భాగంగా పియుసి చైర్మన్, కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాలతో 12 నూతన ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేశారని సిబ్బంది తెలిపారు అందులో భాగంగా బ్యాంక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన టాన్స్ ఫార్మర్ నిర్మించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టా శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తాడి ఆదిత్య రెడ్డి, మాజీ సర్పంచ్ ద్వారంపూడి దొరబాబు,డి ఇంద్రారెడ్డి వైసిపి కార్యకర్తలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment