Followers

ఆసుపత్రిని సందర్శించిన నాయినేని పవన్

 ఆసుపత్రిని సందర్శించిన నాయినేని పవన్



కూకట్ పల్లి, పెన్ పవర్

కూకట్ పల్లిలోని రాందేవ్ రావు ఆసుపత్రిని కూకట్ పల్లి బీజేపీ ఇంచార్జ్ నాయినేని పవన్ కుమార్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలో కరోన టీకాలు వేసుకున్న వారికి పండ్లరసాలు, సానిటైజర్లు పంపిణీ చేశారు. కరోన టీకాలు ఇచ్చే పద్ధతులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన టికాలపై వస్తున్న వదంతులు నమ్మకుండా ప్రతి ఒక్కరూ కరోన టీకాలు తీసుకోవాలని కోరారు. పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్యాని అందిస్తున్న రాందేవ్ రావు ఆసుపత్రి సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ యోబు, డాక్టర్ కల్పన, బాలజీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ గౌడ్, బిజెవైఎం నాయకులు కార్తీక్, శ్రీధర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...