Followers

ఘనంగా రాష్ట్ర పి సి సి కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి జన్మదిన వేడుకలు.

 ఘనంగా రాష్ట్ర పి సి సి కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి జన్మదిన వేడుకలు.

 వెల్దుర్తి,  పెన్ పవర్

 మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట, వెల్దుర్తి పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  పి సి సి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శనివారం మాసాయిపేట లో ఎంపీటీసీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెడుతూ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే వెల్దుర్తి పట్టణంలో మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి , వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నెల్లూరు నిరంజన్ రెడ్డి ల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజు రెడ్డి సమక్షంలో అభిమానులు, కార్యకర్తలు మండలంలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన తన అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకుడు ఆవుల రాజిరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని వారి కుటుంబం చల్లగా ఉండాలని దేవుని ప్రార్థించారు. వెల్దుర్తి మండలం లో కాంగ్రెస్ పార్టీ కి పునర్జన్మ ఇచ్చారని అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున అధికార పార్టీకి గూగుల్ పెట్టిలా కాంగ్రెస్ పార్టీకి ఒక గుర్తింపు తెచ్చారని ఆయనను కొనియాడారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...