Followers

స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీందీక్ష వాల్ పోస్టర్లు విడుదల

 స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీందీక్ష వాల్ పోస్టర్లు విడుదల

ఆదిలాబాద్ ,పెన్ పవర్

ఇచ్చొడ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ గురుకుల కళాశాలలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్,  స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భీం దీక్ష వాల్ పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్,మాట్లాడుతూ మార్చి నెల 15 కాన్షిరాం జయంతి నుంచి మొదలుకొని 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జ్ఞాన సమాజ నిర్మాణానికి స్వేరోస్ పనిచేస్తుందని అక్షరం ఆరోగ్యం ఆర్థిక అనే అంశాలపై అనునిత్యం కృషి చేస్తారని అన్నారు. ఈ భీం దీక్ష నెల రోజుల పాటు జరుగుతుందని ఇందులో ప్రతి రోజు 5గంటలకు లేచి పుస్తక పఠనం,భీం విద్య నిది, ఆరోగ్య జాతర ,విఎల్సీ సందర్శన,పల్లెనిద్ర,బుక్ రీడతాన్,భీం విందు,జ్ఞాన ముగ్గులు,భయ దానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుతుందని, వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ డోంగ్రే తేమాజి, స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నరేశ్, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరావు పాటిల్ ,ఎస్ ఎస్ యు ఉపాధ్యక్షుడు వినోద్,ఇచ్చొడ స్వేరోస్ అధ్యక్షుడు విశ్వబోధి,నాయకులు రాజ్ కుమార్, విద్యార్థులు,కళాశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...