భారత్ బంద్ ను విజయవంతం చేసిన సిఐటియు, రైతు, కార్మిక సంఘాలు...
పెన్ పవర్, మేడ్చల్
ఈరోజు రైతు సంఘాల, కార్మిక సంఘాల బంద్ పిలుపులో భాగంగా మేడ్చల్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం ల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక 4 చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రైతుల పంట కి కనీస మద్దతు ధరలు ప్రకటించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని, అదే విధంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, పప్పు, ఉప్పు, నూనె, అల్లం, బియ్యం నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని, పేద ప్రజల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నుల భారాన్ని మోపుతోందని నరేష్ తెలియజేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటిలో కూడా తమ వాటాను పెంచుతూ పోతావుంది, కానీ తగ్గించడం లేదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం మీద, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద, ఒకరిమీద ఒకరు సాకులు చెప్పుకుంటూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ నెత్తిమీద గుదిబండ ను పెడుతూ చేతులు దులుపుకుంటున్నారు అని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను 4 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటాచారి, సుధాకర్, రాములు, కృష్ణ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment