Followers

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం..

 మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

పీఆర్టియు మేడ్చల్ జిల్లాశాఖ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిబిఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సహా వివిధ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచే విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ నెల 14న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మహిళకు అవకాశం కల్పించడం ఇందుకు నిదర్శనం అన్నారు. వేసే ప్రతి ఓటు తలరాతలను మారుస్తుందని పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, పట్టభద్రులైన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఆమెకు అఖండ విజయాన్ని అందించాలన్నారు. అనంతరం గత సంవత్సరం నుండి పదవి విరమణ పొందిన మహిళా ఉపాధ్యాయురాళ్ళకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు బూర్గుబావి హన్మంత రావు, సభాద్యక్షురాలు బి.ఆశారాణి, పీఆర్ టియు జిల్లా అధ్యక్షులు రామేశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కుత్బుల్లాపూర్ ఎంఈఓ ఆంజనేయులు, జిహెచ్ఎం స్వరూప రాణి, పిఆర్ టియు రాష్ట్ర బాధ్యులు జి.విజయలక్ష్మీ, పుష్పలత, సరస్వతి, మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...