సింగరేణిలో నో అబ్జెక్షన్ ధ్రువీకరణ కోసం జాతీయ కార్మిక సంఘాలు చర్చించాలి
సింగరేణి అపరేటర్స్ సంఘం అధ్యక్షులు బేడ్డల విజయ్
బెల్లంపల్లి,పెన్ పవర్
నో అభ్జెక్షన్ పత్రం కోసం అన్ని జాతీయ కార్మిక సంఘాలు మరియు ప్రాంతీయ సంఘాలు యాజమాన్యం తో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి ఆపరేటర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెడ్డల విజయ్ కోరారు.శనివారం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్యకు తమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.అనంతరం బెడ్డల విజయ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి లో పని చేస్తున్న కార్మికులకు ఎన్ ఓ సి సర్టిఫికెట్ విషయంలో జాతీయ సంఘాలు అన్ని సంఘాలు యాజమాన్యంతో చర్చించి 1800 మంది కార్మికులకు న్యాయం చేయాలని అని అన్నారు.ఎన్ ఓ సి కారణంగా రేపు రాబోయే నోటిఫికేషన్ లలో చాలా మందికి అర్హత కోల్పోతారని, అలా జరగకుండా వెంటనే యాజమాన్యానికి తెలియజేసి రాబోయే నోటిఫికేషన్ లో కార్మికులకు అవకాశం కల్పించాలని అని కోరారు. మొన్న ఇచ్చిన సర్కులర్ కొంతమందికి కి వర్తించింది.ఇంకా చాలా మంది కార్మికులకు ఎన్ఓసి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సర్కులర్ ఉపయోగపడలేదు కావున మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కింద ఎన్ ఓ సి తీసుకోవడానికి మళ్ళీ ఒక సర్కులర్ తీసుకువచ్చి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు..
No comments:
Post a Comment