కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాత పశువుల అభివృద్ధి
పెద్దాపురం,పెన్ పవర్
పెద్దాపురం మండలం, సిరివాడ గ్రామంలో రైతు భరోసాకేంద్రం నందు ఆత్మ మరియు ఎస్ఎఐపి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరమునిర్వహించి గుడివాడ సిరివాడ రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు
చేయడం జరిగింది. ఈ యొక్క రైతుల అవగాహన సదస్సుకు డి.ఎల్.డి.ఎ. ఇ.ఒ.డా॥ ఆర్.వెంకటేశ్వరరావు, ఆర్ఎహెచీసి అసిస్టెంట్ డైరెక్టర్ పి.వి.వరప్రసాద్,ఏరియా ప్రభుత్వ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా॥ వై.శ్రీనివాసరావు, పశువైద్యులు.డాక్టర్ చిక్కం బాలచంద్రయోగేశ్వర్ హాజరై వీరు మాట్లాడుతూ. కృత్రిమ గర్భదారణ ద్వారా మేలుజాతి పశువుల అభివృద్ధి, ఏడాదికి ఒక దూడ యాజమాన్య పద్ధతులు, అధిక పాలదిగుబడికి పశుగ్రాసాలు, చూడి పశువుల సంరక్షణ వంటి విషయములపై రైతులకుఅవగాహన కల్పించుట జరిగింది. ఈ పశువైద్యశిబిరాన్ని సిరివాడ గ్రామ సర్పంచి.ఇనకొండ కృష్ణకుమారి వీరవిష్ణు చక్రం ప్రారంభించి గుడివాడ సిరివాడగ్రామాల పరిధిలో150 పశువులకు వైద్య పరీక్షలుదూడలకు ఏటిక మందులు,చూడి పరీక్షలు, చూడి కట్టని పశువులను పరీక్షించి వాటికి సరియైన చికిత్స అందించి ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడఉపసర్పంచ్ శ్రీమతి రేలంగి వరలక్ష్మి అప్పారావుకాండ్రకోట పశువైద్యులుడా॥ తోట నవీన్, ఆర్.బి.పట్నం పశువైద్యులు డా॥ కె.రాకేష్ , కాండ్రకోట వెటర్నరీఅసిస్టెంట్ కాశీరాజు,గోపాలమిత్ర సతీష్, ఎహెచ్ఎలు ప్రతాప్,పూర్ణ, షేక్ దర్గలుపాల్గొన్నారు.
No comments:
Post a Comment