Followers

జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక

 జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక

పెన్ పవర్,ఆలమూరు

  భారతీయ మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని ఆలమూరు మండల ప్రజాపరిషత్తు పరిపాలనా అధికారి టీవీ సురేందర్రెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలో గల మహిళా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ మహిళా సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు.

 ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కరోనాపై పోరులో సైతం ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని ప్రస్తుతించారు. భారత సామాజిక స్దితిగతుల మేరకు సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న వారు ఎంతో సహనంతో తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి అని ఆయన కొనియాడారు.సమాజంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రాజ్ కుమార్, పంచాయితీ కార్యదర్శులు ఆర్ వీ సత్యనారాయణ, విజయ రాజు, సంజీవ్ రెడ్డి, వీర్రాజు పలువురు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...